కేంద్ర ప్రభుత్వం చట్ట సభలను అగౌరవ పరుస్తోంది..

నల్లగొండ: సహాకార ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన పాలక మండళ్లకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం చట్ట సభలను అగౌరవ పరిచేలా వ్యవహరించడం దారుణమన్నారు. 2014 రాష్ట్ర విభజన చట్టాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవహేళన చేయడం సరికాదన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ జమ్ము-కశ్మీర్ కు మాత్రమే వర్తిస్తుందనడం విడ్డూరంగా ఉంది.  శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం మాట తప్పడం సరికాదు. ఆనాడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు, లోకసభలో సుస్మాస్వరాజ్ సహా పలువురు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం గౌరవించాలని గుత్తా డిమాండ్ చేశారు.