పర్ణశాలను సందర్శించిన తపాలా అధికారులు

 


దుమ్ముగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల రామాలయాన్ని పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ గోవిందరాజు, హైదరాబాద్‌ డివిజన్‌ మేనేజర్‌ సుచీ ఓజా గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వీరిద్దరు అధికారులు శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రపాదాలను స్వీకరించారు. పంచవటి కుటీరాన్ని తిలకించి పర్ణశాల ప్రాశస్తం గురించి అక్కడ గైడ్‌ను అడిగి తెల్సుకున్నారు. అనంతరం పర్ణశాల, బండిరేవు, లక్ష్మీనగరం బ్రాంచి పోస్టాఫీస్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... తపాలా శాఖ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతమైన సేవలు అందించడానికి రూపకల్పన చేశామని, ఇందులో భాగంగా ఆధార్‌ నంబర్‌తో బ్యాంకు ఆర్థిక లావాదేవీలు జరుపుకోవచ్చని వీటిని ప్రజలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఖమ్మం డివిజన్‌ అధికారులు అనిల్‌కుమార్‌, జైల్‌సింగ్‌, పర్ణశాల బ్రాంచి పోస్టు మాస్టర్‌ ఎస్కే ఫిరోజ్‌పాషా, అసిస్టెంట్‌ పోస్టు మాస్టర్‌ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.