పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

 












 

 


ఆదిలాబాద్‌  : ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ శ్రీ దేవసేన అదికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో వార్షిక పరీక్షలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్చి4 నుంచి 23 వరకు నిర్వహించే ఇంటర్మీడియెట్‌ వార్షీక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని సూ చించారు.  పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఇన్విజిలేటర్స్‌ నిబంధనలు తెలుసుకోవాలన్నారు. ఆందోళన చెందుతున్న విద్యార్థులకు మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు. జవాబు పత్రాలను రోజువారీగా ప్యాకింగ్‌ చేసి పోస్టుద్వారా పంపించాలన్నారు. సమావేశంలో ఇంటర్మీడియెట్‌ జిల్లా అధికారి దస్ర్తునాయక్‌, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు రవీందర్‌, విఠల్‌, ఇన్విజిలేటర్స్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.