వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు కథానాయకుడు నాని. ఉగాదికి ‘వి’తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన, ప్రస్తుతం ‘టక్ జగదీష్’లో నటిస్తున్నారు. ఆ తర్వాత చేయబోయే సినిమా కూడా ఖరారైంది. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్‌సింగరాయ్’ అనే చిత్రాన్ని చేయబోతున్నారు నాని. ‘టాక్సీవాలా’తో విజయాన్ని అందుకున్న దర్శకుడే రాహుల్. నాని ఈ చిత్రంలో శ్యామ్ సింగ రాయ్ అనే పాత్రలోనే కనిపించి వినోదాన్ని పంచబోతున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తారు. సోమవారం నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా వివరాల్ని ప్రకటించారు నిర్మాత. ఈ ఏడాది డిసెంబరు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.