దిల్లీ: షెడ్యూల్డు ఏరియాలో వంద శాతం రిజర్వేషన్ల కల్పనపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై వాదనలు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డు ఏరియాలో వంద శాతం రిజర్వేషన్లు కల్పించడం తగదంటూ లీలాప్రసాదరావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ అరుణ్‌మిశ్ర, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్‌శరణ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.