బెటాలియన్‌ నిర్మాణం వేగవంతం చేయాలి..





 






 


ఆదిలాబాద్‌ రూరల్‌ : రెండో బెటాలియన్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా అన్నారు. మండలంలోని యాపల్‌గూడ గ్రామశివారులో ఉన్న రెండో బెటాలియన్‌ను శనివారం ఆయన పరిశీలించారు.  బెటాలియన్‌ నిర్మాణ పనులు ఆలస్యంగా సాగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నిర్మాణ పనులు ముగియాల్సి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ రాందాస్‌ను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి నిధుల సమస్యల లేకుండా చూస్తామన్నారు. బెటాలియన్‌ ఆవరణలో హరితహారంలో భాగంగా విస్తారంగా మొక్కలు నాటాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ ఎన్‌ఎస్‌వీ వెంకటేశ్వర రావు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ అప్పారావు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు, గ్రామీణ సీఐ పురుషోత్తం చారి, బెటాలియన్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు  నారాయణసింగ్‌, నవనీత్‌ కుమార్‌, నారాయణ, ఎస్సై రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.