సమాచార కమిషన్‌లో ఎస్సీ, బీసీలకు అవకాశం కల్పించాలి

హైదరాబాద్‌: తెలంగాణ సమాచార కమిషన్‌లో బీసీ, ఎస్సీలకు కమిషనర్లుగా అవకాశం కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సమాచార కమిషన్‌ సమతూకంగా ఉండాలన్నారు. కమిషన్‌లో గతంలో ఇద్దరి నియామకం జరగగా తాజాగా మరో అయిదుగురికి పదవులు ఇచ్చారన్నారు. మొత్తం ఏడుగురిలో ఒక్కరే బీసీ కాగా ఎస్సీలకు అవకాశమే కల్పించలేదని అన్నారు.