జడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్

కొత్త కార్యవర్గంతో జడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్
మహబూబ్‌నగర్ సాంస్కృతికం, న్యూస్‌టుడే : తెలుగు సాహితీ వైభవాన్ని నలుదిశలా చాటేలా కార్యక్రమాలతో నూతన ఒరవడి తీసుకురావాలని జడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ కార్యవర్గాన్ని శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వర్ణసుధాకర్ మాట్లాడుతూ ప్రజల జీవన విధానాలతో సాహిత్యం, కళలు, సంస్కృతి ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు. తెలుగు సాహితీపీఠం రాష్ట్ర అధ్యక్షుడు డా.నలవోలు నర్సింహారెడ్డి, జాతీయ సాహిత్య పరిషత్తు అధ్యక్షుడు పొద్దుటూరి ఎల్లారెడ్డి, ప్రముఖ కవులు కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, కట్ట గిరిజారమణ మాట్లాడుతూ తెలుగు సాహిత్య వెలుగులను ప్రసరింపజేసేందుకు ఈ నూతన కార్యవర్గం పురుడు పోసుకోవటం అభినందనీయమన్నారు.
నూతన కార్యవర్గం : తెలంగాణ మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షురాలిగా చుక్కాయపల్లి శ్రీదేవి, అధ్యక్షురాలిగా రావూరి వనజ, ప్రధాన కార్యదర్శిగా జి.శాంతారెడ్డి, కోశాధికారిగా లావణ్య, కార్యనిర్వాహక కార్యదర్శులు డా.భారతి, శ్రీదేవి, కోట్ల శైలజ, సంయుక్త కార్యదర్శిగా కె.అనిత, గౌరవ సలహాదారులుగా డా.ముదిగంటి సుజాతరెడ్డి, వి.మనోహర్‌రెడ్డి, డా.నలవోలు నర్సింహారెడ్డి, పొద్దుటూరి ఎల్లారెడ్డి, కోట్ల వనజాతలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గెలాక్సీ పాఠశాల ప్రిన్సిపల్ భానుప్రకాశ్, రమేశ్, జి.రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.