మిషన్‌ భగీరథ నీటినే తాగాలి

బేల : రాష్ట్ర ప్రభుత్వం గ్రామంలోని ప్రతి ఇంటికి అందించే మిషన్‌ భగీరథ నీటినే తాగాలని బేల ఎంపీపీ టాక్రే వనితా గంభీర్‌ అన్నారు. మిషన్‌ భగీరథ పథకంపై సర్పంచ్‌, ఎంపీటీసీలకు, పంచాయతీ సిబ్బందికి గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మిషన్‌ భగీరథ శాఖ అధికారులు మంచినీటిపై అవగాహన కల్పించారు. మిషన్‌ భగీరథ ద్వారా వచ్చేది శుద్ధమైన నీరు అని, బోరుబావి ద్వారా వచ్చే నీటితో కలిగే ఉపయోగాలు, నష్టాలపై ప్రత్యేక్షంగా ప్రదర్శించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్వో వాటర్‌లో ఖనిజ రసాయనాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయని, మిషన్‌ భగీరథ ద్వారా అందించే నీరు పుష్కలంగా రసాయనాలు లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటికి వచ్చే మిషన్‌ భగీరథ నీటిని తాగాలని, గ్రామంలోని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో మహేందర్‌కుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్‌టాక్రే, అడనేశ్వర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సతీశ్‌ పవార్‌, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు వట్టిపెల్లి ఇంద్రశేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండల మాజీ అధ్యక్షుడు దేవన్న, సర్పంచులు బిపీన్‌, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.