
ఇల్లెందు: నవజాత శిశువులపై జాగ్రత్తలు పాటించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ భాస్కర్‌నాయక్ ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లకు సూచించారు. నవజాత శిశువుల సంరక్షణ పట్ల వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ఆశావర్కర్లకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎంఅండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ గర్భిణీగా గుర్తించబడిన నాటి నుంచి 2సంవత్సరాల వరకు సంబంధిత ఆశా వర్కర్లు తగు సలహాలు, సూచనలు అందించాలన్నారు. మాతా, శిశు మరణాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలనీ, ప్రసవాలు ప్రభుత్వ వైద్యశాలలో జరిగే విధంగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి, రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వైద్యశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి, మొక్కలు నాటి, అవి ఎదిగే వరకు సంరక్షించుకోవాలన్నారు. వైద్యాధికారి వరుణ్, సిబ్బంది అమరావతి పాల్గొన్నారు.A