మిగతా ఆఫీసుల మాదిరిగానే జ్యురిచ్ కార్యాలయం ఓపెన్ చేసే ఉంటుందని ప్రతినిధి స్పష్టం చేశారు. తమ దేశంలో ఇప్పటి వరకు 15 కేసులను గుర్తించామని, వందలాది మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్, ఇటలీ, చైనా దేశాలకు ప్రయాణించొద్దని ఉద్యోగులకు గూగుల్ సూచించింది. కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.