కరోనా వైరస్ : 59,694 మందిలో 105 మంది సేఫ్


కరోనా వైరస్ పై అనుమానం ఉన్న 59,694 మందిలో 105మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు మహరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.జనవరి 18న కరోనా వైరస్ తో చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్, దక్షిణ కొరియా, జపాన్, నేపాల్, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, ఇరాన్, ఇటలీ నుంచి వచ్చిన 59,694  ప్రయాణికులను ఛత్రపతి శివాజీ మహారాజ్ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించి అబ్జర్వేషన్ లో ఉంచారు. అలా ముంబై తో పాటు, మహహరాష్ట్ర , పూణే, నాసిక్ కు చెందిన ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులలో అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.




 

తాజాగా 59,694 ప్రయాణికుల్లో మహరాష్ట్రలో చికిత్స పొందుతున్న వారిలో 105మందిని విడుదల చేయగా..నలుగురికి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ ప్రకటించారు.