వరంగల్ : మహిళలు శక్తి రూపాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వారి కాళ్లపై వారు నిలబడేలా 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం ప్రోత్సాహకాలు ఇస్తూ ఆత్మగౌరవంతో బతికేలా మన ముఖ్యమంత్రి కేసిఆర్ తోడ్పాటునిస్తున్నారని తెలిపారు. వరంగల్ అర్భన్ జిల్లాలోని వరంగల్ ఈస్ట్ నియోజక వర్గ పరిధిలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 50 మంది మహిళలకు కుట్టుమిషన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ....సమాజంలో సగం జనాభాగా ఉన్న మహిళలు పురుషులతో సమానంగా రాణించాలన్నారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్, సఖీ సెంటర్ల ఏర్పాటు చేశారు. మహిళ తాను ఒంటరి కాదని, వారికి అన్ని రకాల తోడ్పాటు ఇచ్చే విధంగా సఖీ కేంద్రాలు పనిచేస్తున్నాయి.