కోవిడ్ విస్తరిస్తున్నట్టు వార్తలు రావడంతో, ఫేస్ మాస్క్‌లకు భారీగా డిమాండ్ పెరిగింది. మార్కెట్‌లో మాస్క్‌ల కొరత ఏర్పడింది. అనారోగ్యం పాలు కాని వారు మాస్క్‌లు పెట్టుకోవాల్సినవసరం లేదని మెడికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నప్పటికీ, ప్రజలు వినడం లేదు. టాయిలెట్ పేపర్లు, నాప్‌కిన్స్‌ను మాస్క్‌లాగా వాడొచ్చని రూమర్స్ రావడంతో, వీటి విక్రయాలు కూడా పెరిగాయి. కోవిడ్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త కోసం సాధారణ ప్రజలు కూడా మాస్క్‌లను కొనుగోలు చేస్తున్నారు. మాస్క్‌ల కొరతకు కారణం హై డిమాండ్ మాత్రమే కాదని, సప్లయిలో కొరత అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. కోవిడ్ బారిన నుంచి పూర్తిగా కాపాడతాయని చెబుతూ.. ఇటలీలో ఒక్కో మాస్క్‌ను 5,520 డాలర్లకు(సుమారు 4 లక్షలకు) అమ్ముతోన్న 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎకానమీకి తగిలే దెబ్బ కంటే.. ఆందోళనల వల్ల కలిగే డ్యామేజే ఎక్కువగా ఉండనుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయేసస్ చెప్పారు. కోవిడ్ భయంతో చాలా వరకుఈవెంట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రెంట్లు తగ్గిపోతున్నాయి. టూరిస్ట్‌ల రాకపోకలు తగ్గిపోయాయి. టూరిస్ట్‌లు రాకపోతుండటంతో, దుకాణాలు మూతపడుతున్నట్టు బ్యాంకాక్‌కు చెందిన ఓ షాప్ ఓనర్ చెప్పారు.ప్రజలు బయటికి వెళ్లడం తగ్గిపోయిందని, వరదలు, రాజకీయ సంక్షోభాలు నెలకొన్నప్పటి కంటే కూడా కరోనా ఎఫెక్టే ఎక్కువగా ఉందని ఉమెన్ క్లోతింగ్ స్టోర్‌కు చెందిన ఓ ఓనర్ చెప్పింది.