24న భారత్‌కు ట్రంప్‌ రాక


భార్యతో కలిసి రెండు రోజుల పాటు పర్యటన



వాషింగ్టన్‌, దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్నారు. భార్య మెలానియాతో కలిసి ఈ నెల 24, 25 తేదీల్లో ఆయన దిల్లీ, అహ్మదాబాద్‌లలో పర్యటిస్తారు. ఉభయ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు వీరి పర్యటన దోహదపడుతుందని శ్వేతసౌధం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ట్రంప్‌ భారత పర్యటనకు వస్తున్నట్టు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు. భారత్‌కు సుమారు రూ.13,543 కోట్ల (1.9 బిలియన్‌ డాలర్ల) విలువైన ‘సమీకృత వాయు రక్షణ ఆయుధ వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వెపన్‌ సిస్టం)’ను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా హోంశాఖ సోమవారం అంగీకరించిన నేపథ్యంలో ట్రంప్‌ పర్యటన ఖరారు కావడం విశేషం.