లీపు’శిశువులు











జనగామ ఆస్పత్రిలో ఐదుగురు శిశువుల జననం








 మహబూబాబాద్‌/ జనగామ: నాలుగేళ్ల కోసారి వచ్చే లీపు (ఫిబ్రవరి 29) శనివారం రోజున మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు, జనగామ ఆస్పత్రిలో ఐదుగురు శిశువులు జన్మించారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పి.ఉమారాణి, జిల్లా కేంద్రం బేతోలుకు చెందిన ఎస్‌.కే.ఫాతిమా, మరిపెడకు చెందిన బానోతు బులీలు మగశిశువులకు జన్మనిచ్చారు. అలాగే.. జనగామ మాతాశిశుసంరక్షణ ఆరోగ్య కేంద్రంలో జయంతి, శాలూభాయ్, హాజిరా, అనిత, అనురాధ గర్భిణులకు ప్రసూతి చేశారు. జన్మించిన ఐదుగురిలో ఒక ఆడ శిశువు, నలుగురు మగ శిశువులు ఉన్నారు.