హైదరాబాద్,: పసుపు పంటకు మద్దతు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని కాంగ్రెస్ కిసాన్‌సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బోర్డు ఏర్పాటులో సాంకేతిక సమస్యలేమైనా ఉంటే పసుపును కనీస మద్దతు ధర జాబితాలోనైనా చేర్చాలని డిమాండ్ చేశారు.