సదాశివనగర్: సదాశివనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని నిఖిత రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రేమ్‌దాస్ తెలిపారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో జగిత్యాలలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఆమె పాల్గొంటుందని చెప్పారు. నిఖితను శుక్రవారం పాఠశాల విద్యాకమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో విద్యాకమిటీ ఛైర్మన్ బలరాంరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు సాయిలు, విద్యాకమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.