మొక్కల సంరక్షణతోనే భావితరాలకు ప్రాణవాయువు


సదాశివనగర్‌: మొక్కల సంరక్షణతోనే భావితరాలకు ప్రాణవాయువు లభిస్తుందని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ అన్నారు. నీటి దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన రామారెడ్డి మండలం రంగంపేట గ్రామంలో మొక్కలకు నీళ్లు పోశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం రెండు మొక్కలు నాటి సంరక్షించాలని గ్రామస్థులకు సూచించారు. నేడు నాటిన మొక్కలే భావితరాలకు స్వచ్ఛమైన గాలితో పాటు ఆహారం అందిస్తాయన్నారు. కార్యక్రమంలో పీడీ చంద్రమోహన్‌రెడ్డి, సర్పంచి శ్యామ్‌గౌడ్‌, తహసీల్దార్‌ బషీరుద్దీన్‌, ఎంపీడీవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.