తెలుగు సినిమా ఘనతను దేశవ్యాప్తంగా చాటిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలు ‘పెళ్లిచూపులు’, ‘మెంటల్ మదిలో’. ఈ చిత్రాలను నిర్మించిన ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి తన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘చూసీ చూడంగానే’. శేష సింధూ రావు దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, మాళవిక హీరోయిన్లు. జనవరి 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మంగళవారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి రేణుదేశాయ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలోకి ఉమెన్ టెక్నీషియన్స్ ఎక్కువమంది రావాలని కోరుకుంటున్నాను. ఏదో ఒకనాటికి మేల్, ఫిమేల్ డైరెక్టర్ అనే భేదం పోయి డైరెక్టర్ అని మాత్రమే మాట్లాడుకోవాలి. ఏ ఫిమేల్ టెక్నీషియన్ అయినా హ్యాపీగా పని చేసుకోగల నైస్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు. ఆయన నాకు ఈ సినిమాలో మదర్ రోల్ ఆఫర్ చేశారు, ఐ లవ్ ద రోల్. కానీ నాకు ఒంట్లో బాగా లేకపోవడం వల్ల చేయలేకపోయాను. నెక్స్ట్ ఫిలింలో అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను. ఈ సినిమా కచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు.