కొంపల్లిలో ప్రయోగాత్మకంగా అమలు
(ఆరోగ్యజ్యోతి) హైదరాబాద్: ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్) రూపొందించిన కృత్రిమ మేధ ప్రాజెక్టును అమలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీలో మొత్తం పది వార్డుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. కృత్రిమమేధ, బిగ్‌డేటా, మిషన్ లెర్నింగ్, డీప్‌లెర్నింగ్ సాఫ్ట్‌వేర్‌ను సంయుక్తంగా ఉపయోగిస్తూ స్వీయచిత్రం (సెల్ఫీ) ద్వారా అర్హులైన ఓటర్ల గుర్తింపు చేపట్టనుంది. ఈ పరిజ్ఞానం ఉపయోగించినపుడు సాంకేతిక పొరపాటు కారణంగా తిరస్కరణకు గురైనా.. మిగతా పత్రాల ఆధారంగా ఓటు హక్కు కల్పిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. ఓటర్ల లైవ్ ఫొటోలు వెంటనే ఎన్‌క్రిప్ట్‌లోకి మార్చి తొలగించేస్తామని, ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఇతరత్రా అవసరాలకు వాడుకోబోదని తెలిపింది.