దుమ్మూ ధూళితో బహుపరాక్‌


  • ఒక బ్యాక్టీరియా జన్యువులు మరో బ్యాక్టీరియాకు బదిలీ..

  • లాస్‌ఏంజిల్స్‌:(ఆరోగ్యజ్యోతి) మీ ఇంట్లోకి దుమ్ము, ధూళి చేరిందా? అయితే వెంటనే శుభ్రం చేయండి. లేకపోతే ఆ దుమ్ము, ధూళిలో ఉన్న బ్యాక్టీరియా, తోటి బ్యాక్టీరియాకు శక్తినిచ్చి మీ ఆరోగ్యానికి మరింత హాని కలుగజేసే ప్రమాదమున్నది. ఇంట్లోని దుమ్ములో నివసించే బ్యాక్టీరియా తనలోని జన్యువులను సమీప బ్యాక్టీరియాకు బదిలీ చేసి, యాంటీబయోటిక్స్‌ను అడ్డుకునే సామర్థ్యాన్ని పెంపొందేలా చేస్తుందని.. దీంతో వ్యాధులు మరింత ఎక్కువగా వ్యాపించే ప్రమాదమున్నదని అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ పరిశోధకులు నిరూపించారు. ఈ వివరాల్ని ‘పీఎల్‌వోఎస్‌ పాథొజెన్స్‌' జర్నల్‌లో ప్రచురించారు. ‘వ్యాధికారకంకాని బ్యాక్టీరియా  సమీపంలోని వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియాకు తనలోని యాంటీ బయోటిక్‌ రెసిస్టెంట్‌ (వ్యాధి నిరోధకతను అడ్డుకునే) జన్యువులను బదిలీ చేస్తుంది. దీంతో ఆ బ్యాక్టీరియాకు యాంటీబయోటిక్స్‌ను అడ్డుకునే సామర్థ్యం మరింత పెరుగుతుంది’ అని ఎరికా హార్ట్‌మాన్‌ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు.