ఇక గాంధీలోనే కరోనా నిర్ధారణ

గాంధీ ఆస్పత్రి వైరాలజీ ల్యాబ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న నిపుణులు











నగరానికి చేరుకున్న వ్యాధి నిర్ధారణ కిట్లు 


గాంధీ ఆస్పత్రిలో ట్రయల్‌రన్‌ ప్రారంభం


మరోవైపు పెరుగుతున్న కరోనా అనుమానిత కేసులు  








నల్లకుంట: కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారణ ట్రయల్‌ రన్‌ పరీక్షలు గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) ల్యాబ్‌ నుంచి వ్యాధి నిర్ధారణకు అవసరమైన రీఏజెంట్స్‌ (ద్రావకాలు)ను హైదరాబాద్‌కు తెప్పించింది. గాంధీ ఆస్పత్రి మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్‌ నాగమణి నేతృత్వంలోని వైద్య బృందం పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్వీప్‌మెంట్‌ ధరించి ట్రయల్‌ రన్‌లో భాగంగా స్క్రీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహించింది. గాంధీలో వచ్చిన రిపోర్టులను, పుణే వైరాలజీ ల్యాబ్‌ జారీ చేసిన రిపోర్టులతో సరి చూసి, రిపోర్టుల జారీలో ఎలాంటి తేడాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత పూర్తిస్థాయిలో నిర్ధారణ పరీక్షలు ఇక్కడే చేయనున్నారు.