వీరన్నపేట (మహబూబ్‌నగర్),(ఆరోగ్యజ్యోతి) : సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న పదో తరగతి విద్యార్థులకు ప్రతిభ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వేదిక నిర్వాహకులు చెన్నప్ప, విష్ణువర్ధన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే పరీక్షకు జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు హాజరు కావాలని కోరారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచినవారికి నగదు బహుమతితోపాటు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.