టీకాలపై రైతులకు అవగాహన కల్పించాలి: జేసీ

గాలికుంటు వ్యాధి టీకాల ప్రచార గోడపత్రికను


ఆవిష్కరిస్తున్న సంయుక్త కలెక్టర్‌ హనుమంతు కొడింబా



ఖమ్మం నగరపాలకం,: (ఆరోగ్యజ్యోతి) జిల్లాలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్న దృష్ట్యా వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని సంయుక్త కలెక్టర్‌ హనుమంతు కొడింబా తెలిపారు. గురువారం తన ఛాంబర్‌లో టీకాల కార్యక్రమంపై పశుసంవర్ధశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకొకసారి పశువులకు ఈ వ్యాధిటీకాలు ఇస్తారన్నారు. పశువైద్య బృందాలు ప్రతి గ్రామాన్ని సందర్శించి పశుయాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. వ్యాధి టీకాలు పంపిణీ చేసిన అనంతరం వాటికి చెవిపోగులు వేసి, వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమాధికారి పరంధామరెడ్డి, డీఎల్‌పీవో ప్రభాకర్‌, సభ్యులు జయశ్రీ, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.