● ఉమ్మడి జిల్లాలోని 15కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
● ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షకు 2,901 మంది
కూసుమంచి: కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికిగానూ శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో ఈ విద్యాలయలో ప్రవేశం కల్పిస్తున్న దృష్ట్యా ప్రవేశ పరీక్షను కూడా ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 2901 మంది విద్యార్థులకుగానూ జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఇన్విజిలెటర్స్‌గా 150మంది విధులు నిర్వహించనుండగా, ప్రతీ కేంద్రంలో ఒక సెంటర్ స్థాయి పరిశీలకులను నియమించారు. నవోదయ విద్యాలయ ఉపాధ్యాయులే పరీక్ష కేంద్రం పరిశీలకులుగా వ్యవహరిస్తారు. జిల్లాలో పది బ్లాకుల వారీగా పరీక్షలు జరగనుండగా, పది బ్లాకులకు పది మంది ఎంఈవోలు లేదా ప్రధానోపాధ్యాయులు బ్లాక్ స్థాయి పరిశీలకులుగా ఉంటారు. నవోదయ విద్యాలయ ప్రధానాచార్యులు జిల్లా స్థాయి పరిశీలకునిగా వ్యవహరిస్తారు. ఉదయం 11.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు: వి. కోటేశ్వరరావు, ప్రధానాచార్యులు. నవోదయ విద్యాలయ, పాలేరు
ఆరో తరగతిలో ప్రవేశపరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 15పరీక్ష కేంద్రాల్లో ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక గది, ఒక ఇన్విజిలేటర్‌ను ఏర్పాటు చేశాం. విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంటుంది. పరీక్ష కేంద్రం మొదలు, జిల్లా స్థాయి వరకు వివిధ దశల్లో పరిశీలకులు ఉంటారు. జిల్లా విద్యాశాఖ అధికారి సైతం కేంద్రాలను సందర్శిస్తారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది ఫ్లయింగ్ స్క్వాడ్‌గా తనిఖీలు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు సైతం ఏర్పాటు ఉంటుంది. ఉదయం 11.30 నుంచి నిర్వహించే ప్రవేశ పరీక్షకు విద్యార్థులకు సకాలంలో రావాలి. 11.00గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తున్న దృష్ట్యా విద్యార్థులు అంతకు ముందుగానే కేంద్రానికి చేరుకుంటే మంచిది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది ఉండదు.
జిల్లాలోని వివిధ పరీక్ష కేంద్రాలు, ేకేటాయించిన విద్యార్థుల సంఖ్య వివరాలు ఇలా ..
పరీక్ష కేంద్రం ప్రవేశ పత్రం సంఖ్య కేటాయించిన విద్యార్థుల (నుంచి) - (వరకు) సంఖ్య
జిల్లా పరిషత్తు సెకండరీ స్కూల్ 3505465 - 3505586 122
(బాలురు) అశ్వారావుపేట
ఎస్‌ఎన్‌ఎం జిల్లా పరిషత్తు 3505587 - 3505789 203
ఉన్నత పాఠశాల కొర్రాజుల గుట్ట
భద్రాచలం
ప్రభుత్వ ఉన్నత పాఠశాల 3505790 - 3505984 195
బూర్గంపాడు
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సత్తుపల్లి 3505985 - 3506174 190
జిల్లా పరిషత్తు సెకండరీ పాఠశాల 3506175 - 3506363 189
(బాలికలు) సత్తుపల్లి
ప్రభుత్వ ఉన్నత పాఠశాల 3506364 - 3506563 200
(బాలికలు) ఒకటో పట్టణ
పోలీసు ఠాణా ఎదుట, ఖమ్మం
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, 3506564 - 3506763 200
రాజేంద్రనగర్, గాంధీ చౌక్,ఖమ్మం
ప్రభుత్వ ఉన్నత పాఠశాల 3506764 - 3506963 200
మామిళ్లగూడెం, ఖమ్మం
ప్రభుత్వ ఉన్నత పాఠశాల 3506964 - 3507157 194
కాల్వఒడ్డు, నయాబజార్: ఖమ్మం
సెయింట్‌మేరీస్ ఉన్నత పాఠశాల 3507158 - 3507337 180
కొత్తగూడెం (పోస్టాఫీీస్ కూడలి)
సింగరేణి కాలరీస్ ఉన్నత 3507338 - 3507509 172
పాఠశాల, కొత్తగూడెం
టీవీఎం ప్రభుత్వ ఉన్నత 3507510 - 3507757 248
పాఠశాల, మధిర
ప్రభుత్వ ఉన్నత పాఠశాల 3507758 - 3507939 182
రిక్కాబజార్, ఖమ్మం
ఆశ్రమ గిరిజన ఉన్నత 3507940 - 3508103 164
పాఠశాల, (బాలికల)
వెంకటాపురం
సింగరేణి కాలరీస్ ఎయిడెడ్ 3508104 - 3508365 262
ఉన్నత పాఠశాల, ఇల్లెందు
మొత్తం 2901