వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి: డీఎంహెచ్‌ఓ

‘108’ పైలెట్‌కు ప్రశంసాపత్రం అందజేస్తున్న డీఎంహెచ్‌ఓ డా.ఎల్‌.భాస్కర్‌నాయక్‌


కొత్తగూడెం పట్టణం, (ఆరోగ్యజ్యోతి): వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డా.ఎల్‌.భాస్కర్‌ నాయక్‌ సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం ఏర్పాటైన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌సీడీ సేవలు, కేసీఆర్‌ కిట్స్‌ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. డ్వాక్రా సంఘం, మహిళల, మండల సమాఖ్య ఏర్పాటు సమావేశాల్లో వైద్యాధికారులు తప్పనిసరిగా మాతృ, శిశు సంరక్షణ సేవలను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డా.శ్రీను నాయక్‌, వైద్యులు పి.వినోద్‌, స్వాతి, ఉప మీడియా అధికారి ఎల్‌.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.


ఎయిడ్స్‌ రహిత సమాజం అందరి బాధ్యత అని డీఎంహెచ్‌ఓ అన్నారు. ‘రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ’ ఆధ్వర్యంలో ప్రజల్లో ఎయిడ్స్‌ నివారణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని గురువారం జిల్లా కార్యాలయంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు.


ఉత్తమ సిబ్బందికి ప్రశంసాపత్రాలు


విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 108, 102 వాహనాల సిబ్బంది జి.హరి, శంకర్‌, పి.మహేందర్‌, కె.శ్రీనివాస్‌, బి.బాలాజీకి డీఎంహెచ్‌వో డా.ఎల్‌.భాస్కర్‌ నాయక్‌ తన కార్యాలయంలో గురువారం ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ ఉపాధ్యక్షుడు టీఎస్‌వీకే రెడ్డి, ముఖ్య ప్రధాన అధికారి బ్రహ్మానందరావు, రీజనల్‌ మేనేజర్‌ ఖలీద్‌, ‘102 అమ్మ ఒడి’ వాహనాల భద్రాచలం కెప్టెన్‌ ఎండీ జాకీర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.