అబార్షన్‌ కాల పరిమితి పెంపు


  • 20 నుంచి 24 వారాలకు పొడిగించిన కేంద్రం

  • రేపటి నుంచి కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

  • మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (సవరణ) బిల్లుకు క్యాబినెట్‌ ఆమోదం

  •  

  • న్యూఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి) గర్భవిచ్ఛిత్తి (అబార్షన్‌)పై  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 20 వారాల కాల పరిమితిని 24 వారాలకు పెంచింది. ఈ మేరకు మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (సవరణ) బిల్లు 2020కి కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మహిళల పునరుత్పత్తి హక్కుల పరిరక్షణ, సురక్షితమైన గర్భవిచ్ఛిత్తి కోసం ప్రస్తుతం ఉన్న అబార్షన్‌ కాల గడువును 20 నుంచి 24 వారాలకు పెంచినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. లైంగికదాడికి గురైన మహిళలు, కుటుంబ సభ్యుల చేతుల్లో లైంగికదాడికి గురైన మహిళలు, మైనర్లు, దివ్యాంగ బాలికలకు ఈ చట్టం రక్షణగా ఉంటుందన్నారు. ఈ బాధితుల్లో చాలా మందికి తాము గర్భం దాల్చిన సంగతి తొలి ఐదు వారాల వరకు తెలియదని, అబార్షన్‌కు అనుమతించిన గడువు ముగియడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జవదేకర్‌ వివరించారు.