హైదరాబాద్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు పంపించారు. పవన్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారనే రాజీనామా చేసినట్లు లేఖలో వెల్లడించారు. పవన్ కల్యాణ్‌లో నిలకడైన విధివిధానాలు లేవని ఆయన పేర్కొన్నారు. ప్రజాసేవకే అంకితం.. ఇకపై సినిమాల్లో నటించనని గతంలో చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విలువలు లేని పార్టీలో కొనసాగలేనని పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ గత కొంత కాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరపున బరిలోకి దిగి ఓడిపోయిన విషయం తెలిసిందే.