ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

బూర్గంపాడు: మండల పరిధిలోని సారపాకలో గల ఓ ప్రైవేటు‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థి పాఠశాల ఆవరణలోని ఓ గదిలో ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బాలుడి మృతదేహంతో పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.