టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శ
హుజూర్‌నగర్, (ఆరోగ్యజ్యోతి) రాష్ట్రంలో భాజపా, తెరాసల మధ్య రహస్య ఎజెండా నడుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో పార్టీ నాయకులతో సమీక్ష సమావేశంలో, అనంతరం నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. కేంద్రం అప్రజాస్వామికంగా పలు బిల్లులు తెచ్చినప్పుడు తెరాస మద్దతుగా నిలిచిందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు విషయంలోనూ ముస్లింలను గందరగోళపరిచేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో మైనార్టీలు తెరాస రహస్య ఎజెండాను అర్థం చేసుకుని తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ ప్రభుత్వం ఆరేళ్లుగా చేసిందేమీలేదని.. ఇక ముందు కూడా చేసే అవకాశం లేదని తేల్చిచెప్పారు.