ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాలి



పాలమూరు,  (ఆరోగ్యజ్యోతి): ఆటోవాలాలు ప్రయాణీకులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి కృషి చేయాలని ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌, ఇతర ప్రాంతాల వద్ద రద్దీగా ఉండే ఆటోవాలలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు ఆటోలలోనే ప్రయాణం చేస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరలించాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే వాటిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. రవాణాశాఖ ఏవో ప్రేమ్‌కుమార్‌, ఏఎంవీఐ నరేశ్‌, లయన్‌ నటరాజ్‌, ఆర్టీఏ సభ్యుడు జావేద్‌ బేగ్‌, తదితరులు పాల్గొన్నారు.



 


 

మరిన్ని