గోడప్రతుల ఆవిష్కరణ

సదాశివనగర్‌: జగదాంబదేవి సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయ 31వ వార్షికోత్సవం సందర్భంగా గోడప్రతులను శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 5నుంచి 7వరకు ఉత్సవాలు జరుగుతాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు డాక్టర్‌ రామారావు మహరాజ్‌ హాజరవుతారని ఆలయ కమిటీ అధ్యక్షుడు లచ్చిరాంనాయక్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సురేందర్‌ నాయక్‌, బాపూసింగ్‌, పీర్‌సింగ్‌, మోహన్‌, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.