న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు అకాళీదళ్ (ఎస్ ఏడీ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమ్ ఆద్మీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రెయిన్ ప్రకటించారు. ఢిల్లీ ఎన్నికల్లోఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి..రాజేంద్రనగర్ నియోజకవర్గ అభ్యర్థికి ఓటేయండి. ఎన్నికల్లో కేజ్రీవాల్ తోపాటు ఆప్ అభ్యర్థులందరికీ ఓటేసి గెలిపించాలని ఓబ్రెయిన్ ట్వీట్ చేశారు. దీంతోపాటు ఓ వీడియో కూడా ఆయన పోస్ట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చింది. ఆప్ బాగా పనిచేసి ఢిల్లీలో విద్యా, వైద్యరంగం, విద్యుత్ రంగంలో మార్పులు తీసుకొచ్చిందని కొనియాడారు. ఢిల్లీలో ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు జరుగనుంది.