నాణ్యమైన వైద్య సేవలందించండి


  • కలెక్టర్‌ భారతి హోళికేరి

  • వైద్య సిబ్బందితో సమీక్ష

  • దవాఖాన నిర్వహణ, ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశం

  • మంచిర్యాల రూరల్‌: (ఆరోగ్యజ్యోతి)  జిల్లా నలుమూలల నుంచి దవాఖానకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా వైద్యాధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడు తూ ప్రభుత్వ దవాఖానలో పారిశుధ్య నిర్వహన పకడ్బందీ గా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి గ్రామంలో గర్భిణులు ప్రభుత్వ దవాఖానకు వచ్చేలా, సాధారణ ప్రసవాలపై ఆశా వర్కర్లు అవగాహన కల్పించాలన్నారు. ప్రణాళిక ప్రకారం సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు. స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ ఎంలు, ఆశా వర్కర్లు ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గర్భిణుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు రిజిస్టర్‌ నిర్వహించాలనీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా దవాఖానకు ప్రసవం కోసం వచ్చే వారి సంబంధిత ప్రొఫార్మాలో పూర్తి వివరాలు రాసి వైద్యులు సంతకం చేసిన పత్రాలను జతచేసి పంపడంతో పాటు గర్భిణుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. జనవరిలో ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చిన గర్భిణులను కరీంనగర్‌కు, ఇతర ప్రైవేట్‌ ఆసుపత్రులకు సిఫారసు చేసిన వారి పూర్తి వివరాలు అం దించాలనీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈడీడీ నిర్వాహణ సక్రమంగా లేని వారికి మెమోలు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసమైన బాలింతలకు కేసీఆర్‌ కిట్లను అందజేయాలని తెలిపారు. జిల్లా ప్రభుత్వ దవాఖాన పర్యవేక్షకుడు నూతన్‌ అరవింద్‌, వైద్యాధికారులు డాక్టర్‌ ఫయాజ్‌, అనీల్‌, నీరజ, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, పర్యవేక్షకులు, క్లస్టర్‌ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.