న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ రెండు బహిరంగసభలకు హాజరవనున్నారు. ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో నిర్వహించనున్న రెండు బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారని కేంద్రమంత్రి హర్షవర్దన్ వెల్లడించారు. కర్కార్‌దూమ ప్రాంతంలోని సీబీడీ మైదానంలో ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు మొదటి సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఫిబ్రవరి 4న ద్వారకాలోని రాంలీలా మైదానంలో జరుగనున్న సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారని కేంద్రమంత్రి హర్షవర్దన్ చెప్పారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 6న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఫిబ్రవరి 8న 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి.