హైదరాబాద్: కరోనా వైరస్ వల్ల తాజాగా 24 మంది మృతిచెందారు. దీంతో చైనాలో ఆ వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 106కు చేరుకున్నది. కరోనా వైరస్ సోకిన బాధితులు నుమోనియా వ్యాధితో మరణిస్తున్నారు. అయితే ఆ వైరస్ సుమారు 4515 మందికి సోకినట్లు తాజాగా అధికారులు నిర్ధారించారు. ఒక టిబెట్ మినహా.. మిగితా చైనా ప్రానిన్సుల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, వియత్నాం, సింగపూర్, మలేషియా, నేపాల్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, శ్రీలంక దేశాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేంద్ర బిందువైన హుబెన్ ప్రావిన్సులో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. దేశవ్యాప్తంగా స్కూళ్లకు స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవులు ప్రభుత్వం పొడగించింది.