సీఏఏతో ముస్లింలకు అపకారం జరగదని వ్యాఖ్య
(ఆరోగ్యజ్యోతి) హైదరాబాద్: లోతుగా అధ్యయనం చేశాకే భాజపాతో పొత్తు నిర్ణయం తీసుకున్నామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. ఇకపై నెలలో కొన్నిరోజులు ఇక్కడ పార్టీ కార్యకలాపాలకు సమయం కేటాయిస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ప్రకాశ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పవన్ మాట్లాడారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించుకునేందుకు అర్హుల పేర్లను కార్యకర్తలే సూచించాలని ఆయన కోరారు. తెలుగు రాష్ట్రాలు, దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసమే పొత్తు పెట్టుకున్నామన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో దేశంలోని ముస్లింలకు అపకారం జరగదన్నారు.