ఏఎన్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలిగా శశికిరణ్‌

శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలోని నారాయణ పారా మెడికల్‌ కళాశాలలో రాష్ట్ర ఎ.ఎన్‌.ఎం, హెల్త్‌ విజిటర్‌, పబ్లిక్‌ హెల్త్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం జరిగింది. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.వెంకటలక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో సంఘం జిల్లా అధ్యక్షురాలిగా ఎస్‌.శశికిరణ్‌ (బూరాడ పీహెచ్‌సీ), కార్యదర్శిగా ఎం.మాలతీచందూర్‌ (మురపాక పీహెచ్‌సీ), మరో 20 మందిని కార్యవర్గ సభ్యులుగా వివిధ హోదాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జోన్‌-1లో ఏఎన్‌ఎంల సీనియార్టీ జాబితా అప్‌డేట్‌ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని సమావేశంలో తీర్మానాలు చేసినట్లు వెంకటలక్ష్మి పేర్కొన్నారు.