పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలి


ధన్వాడ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. శుక్రవారం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ, ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో గవర్నర్‌ ఆధ్వర్యలో రెడ్‌క్రాస్‌ సేవలు కొ నసాగుతాయన్నారు. రెడ్‌క్రాస్‌ సేవల గురించి గవర్నర్‌ ఇటీవలే కలెక్టర్‌లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రెడ్‌క్రాస్‌ సేవలను కొనసాగించే విధంగా చూడాలని చెప్పారు. ప్రధానంగా గ్రామీ ణ ప్రాంతాల్లో అందరికీ వైద్య సేవలు అందించడం కోసం సంస్థ ఆధ్వర్యలో కృషి చేయాలని, హెల్త్‌ క్యాంప్‌కు వచ్చిన వారికి ఎమైనా ఇబ్బందికరమైనా వైద్య చికిత్సలు అందించాల్సిన అవసరం ఉం టే వారిని జిల్లా కేంద్రానికి రెఫర్‌ చేయాలన్నారు. జిల్లాలో యువత ద్వా రా సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందుకు డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాలలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కో సం యుత్‌ కమిటీలను చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ హెల్త్‌ క్యాం పులో 286మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి శైలజ, ధన్వాడ వైద్యాధికారి వెంకట్‌, రెడ్‌క్రాస్‌ సోసైటీ వైద్యులు మధన్‌మోహన్‌రెడ్డి, యశ్వంత్‌, రాంబాబు, కృష్ణారెడ్డి, సచిన్‌లు పాల్గొన్నారు.