లచ్చగూడెంలో ఉచిత నేత్ర శిబిరం


చింతకాని: మండలంలోని లచ్చగూడెం ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఖమ్మం అఖిల నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో విద్యార్థులను పరీక్షించి ఉచితంగా మందులు అందచేశారు. పలువురికి దృష్టి లోపం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్య విషయాల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు డా.రమేశ్‌, హెచ్ఎం సూర్యకుమారి, క్యాంపు ఇంఛార్జ్ విక్రమ్ సింగ్, ఐఈఆర్పీ వైద్య నిపుణులు కృష్ణారావు పాల్గొన్నారు.