జైనూర్ : మండల కేంద్రంలోని సిర్పూర్(యు) రోడ్డుపై ఉన్న ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానాలో శుక్రవారం 12వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅథితిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావ్ హాజరై, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన ప్రాం తంలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ద్వారా నిరుపేదలకు ఉచితంగా పరీక్షలు, చికిత్సలు చేయించడం అభినందనీమన్నారు. ఎల్వీ ప్రసాద్ విజన్ టెక్నీషియన్ సెడ్మకి గణేశ్ మాట్లాడుతూ.. తాను నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన తనకు ఎల్వీ ప్రసాద్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ కల్పించి, నిరుపేదలకు కంటి పరీక్షలు చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాయిసిడాం నాగేంద్ర, ఆశ కో-ఆర్డినేటర్, హెల్త్‌సూపర్‌వైజర్ లక్ష్మీకుమారి, ఆఫ్తల్మిక్ ఆఫీసర్ శ్రీధర్‌బాబు, లింగాపూర్ జడ్పీటీసీ లఖబాయి, నాయకులు కబీర్‌దాస్, ఏఎన్‌ఎం, తదితరులు పాల్గొన్నారు.