ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

ఆలేరురూరల్‌ : ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన శిరంజి క్రాంతికి లక్ష రూపాయాల ఎల్‌వోసీ, సీఎం సహాయనిధి కింద పోతు ప్రవీణ్‌కు లక్ష రూపాయాలు, హేమల రాజిరెడ్డికి రూ.39వేలు, గవ్వల భూమయ్యకు రూ.15వేల మంజూరైన చెక్కులను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. లబ్ధిదారులు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఉన్నారు.