హెర్నియేషన్‌తో జన్మించిన శిశువు మృతి

ఆదిలాబాద్‌ : జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌లో హెర్నియేషన్‌తో జన్మించిన శిశువు సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. సకాలంలో చికిత్స అందకపోవటంతోనే శిశువు మృతి చెందాడు. భుక్తాపూర్‌లో నివాసముండే మాన్‌సింగ్‌-మున్ని దంపతులకు శుక్రవారం రాత్రి చిన్నారి జన్మించాడు. ఇంటి వద్దనే కాన్పు కాగా శిశువు హెర్నియేషన్‌తో జన్మించాడు. ఇలా జన్మించిన వారికి రిమ్స్‌లో శస్త్రచికిత్స చేసే సదుపాయం లేకపోవటంతో వెంటనే హైదరాబాద్‌ తరలించాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో వారు చిన్నారిని రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూలోనే ఉంచారు. సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందకపోవటంతో శిశువు మృతి చెందాడు.