నారాయణగూడ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాతికేళ్లుగా వాజ్‌పేయీ జన్మదినోత్సవం నాడు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాజపా నేతలు వెంకట్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ రమేశ్ యాదవ్, ఎక్కాల నందు, గౌతమ్, చిట్టి శ్రీధర్, అజయ్, అమృత, బీజేవైఎం నేతలు రవీందర్‌గౌడ్, కృష్ణాగౌడ్, నర్సింగ్ యాదవ్ పాల్గొన్నారు.