నూతక్కి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళగిరి మండలంలోని నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకున్నారు. పీహెచ్‌సీల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, ఆసుపత్రిలో ఉండవలసిన డాక్టర్లు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు.
పీహెచ్‌సీలోని వివిధ విభాగాల్లో కలయతిరిగి రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి ధియేటర్, డెలివరీరూమ్, శానిటేషన్ ఎలా ఉందంటూ మరుగు దొడ్లను సైతం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమర్, డైరెక్టర్ ఆఫ్‌హెల్త్ డాక్టర్ ఎస్.అరుణ, డీఎంహెచ్‌వో డాక్టర్ జె.యాస్మిన్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ పద్మావతి, తహసీల్దార్ రాంప్రసాద్, డీఎల్‌వో సుబ్బారావు, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఆర్.దుర్గాశైలజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.