వ్యాయామానికి పెద్దపీట!!

దేవరుప్పుల: బాల్యానికి పునాది పడే పాఠశాలల్లో వ్యాయామ విద్యకు ప్రాధాన్యమిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భావిభారత పౌరులు బలహీనంగా తయారవుతున్నారని గమనించిన కేంద్ర ప్రభుత్వం, చదువుతోపాటు శారీరక మానసికోల్లాసానికి ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో నుంచి ఫిట్‌ ఇండియా స్కూల్‌ను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో కచ్చితంగా నిత్యం వ్యాయామం చేయాలని, ఇందుకోసం అనుసరించాల్సిన విధివిధానాలను విడుదల చేసింది.