పాటూరులో వైద్యశిబిరం

పాటూరు: పాటూరులో బొద్దాం పీహెచ్‌సీ వైద్యాధికారిణి ఎన్‌.అనురాధ సారథ్యంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. 'పాటూరులో ముగ్గురికి డెంగీ లక్షణాలు...?' శీర్షికన కథనం వెలువడిన విషయం విదితమే. ఈ మేరకు ఆమె తమ సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులను పరీక్షించారు. అవసరమైన వారందరికీ మందులు పంపిణీ చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు. సమీపంలోని పంట కాలువలో యాంటీ లార్వా నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎన్‌.ఎం. స్వప్నకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.