జీవవ్యర్థాలు శుద్ధి చేయని ఆసుపత్రులపై చర్యలు తీసుకోండి’

హైదరాబాద్‌: జీవ వ్యర్థాలను(బయో మెడికల్‌ వేస్టు) నిబంధనల ప్రకారం శుద్ధి చేయకుండా హైదరాబాద్‌లోని కొన్ని ఆసుపత్రులు సాధారణ మున్సిపల్‌ వ్యర్థాల్లో కలిపి పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని చేస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి శనివారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారాన్ని దీనికి జత చేశారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల దాదాపు 350 ఆసుపత్రులు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు లేకుండా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.