వైరాలజీ ల్యాబ్ ఏర్పాటులో మళ్లీ వెనుకడుగే!


  • రెండు ఎకరాలు ఇవ్వని రాష్ట్ర సర్కారు

  • రెండేండ్ల నుంచి నాన్చుడు

  • పాత బిల్డింగ్​లో ఏర్పాటు కుదరదన్న సెంట్రల్​ టీం

  • రాష్ట్ర సర్కార్​ తీరుపై అసంతృప్తి

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో భూమి కేటాయించాలని సూచన


హైదరాబాద్:ప్రతిష్టాత్మక వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటులో మళ్లీ వెనుకడుగు పడింది. పాత బిల్డింగ్​లో తాత్కాలికంగా ల్యాబ్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రపోజల్​ను కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినట్లు తెలుస్తోంది. అట్ల ఏర్పాటు చేయడం కుదరదని, కనీసం రెండెకరాల స్థలం కేటాయించాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. స్థలం కేటాయించాలంటూ ఇప్పటికే పలుసార్లు రాష్ట్ర సర్కార్​కు సెంట్రల్​ హెల్త్​ టీం సూచించింది. ఇటీవల కూడా మరోసారి సూచించినా రాష్ట్ర సర్కార్​ నుంచి సరైన స్పందన రాలేదు.


హైదరాబాద్​ కోఠీలోని వైద్యారోగ్యశాఖ ఆఫీసు ఆవరణలో ఉన్న ఓ బిల్డింగ్​ను వైరాలాజీ ల్యాబ్ కోసం స్టేట్ గవర్నమెంట్ ప్రతిపాదించగా..  ఈ నెల 13న ఢిల్లీ నుంచి సెంట్రల్‌‌ హెల్త్ టీం వచ్చి పరిశీలించింది. వైరాలజీ ల్యాబ్ ఏర్పాటుకు ఈ బిల్డింగ్ సరిపోదని, హైదరాబాద్ చుట్టు పక్కల రెండెకరాల స్థలం కేటాయించాలని స్టేట్​ హెల్త్​ మినిస్టర్​ ఈటల రాజేందర్‌‌‌‌కు టీం తెలిపింది. స్థల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామని, అంతవరకూ తాము చూపిన బిల్డింగ్​లో ల్యాబ్ ఏర్పాటు చేయాలని సెంట్రల్​ హెల్త్​ టీంకు మంత్రి సూచించారు. పది రోజుల్లో తాత్కాలికంగా ల్యాబ్ పనులు ప్రారంభమవుతాయని ఆరోజు మంత్రి మీడియాకు వెల్లడించారు. అయితే మీడియా సమావేశంలో సెంట్రల్ టీం సభ్యులు కూడా పాల్గొనప్పటికీ తాత్కాలిక ల్యాబ్ ఏర్పాటుపై వారు స్పందించకుండానే వెళ్లిపోయారు. పదిరోజుల్లో తాత్కాలికంగా ల్యాబ్ పనులు ప్రారంభమవుతాయని మంత్రి చెప్పి ఇన్నిరోజులైనా ఆ దిశగా ముందడుగు పడలేదు. పాత బిల్డింగ్​లో ల్యాబ్​ ఏర్పాటు చేయడం కుదరదని, తాత్కాలికంగా కూడా ఆ బిల్డింగ్‌‌ పనికిరాదని రాష్ట్ర హెల్త్ ఆఫీసర్లకు సెంట్రల్​ టీం స్పష్టం చేసినట్లు తెలిసింది.


నాన్చుతున్న రాష్ట్ర సర్కార్​


హైదరాబాద్‌‌లో వైరాలజీ ఏర్పాటు చేయాలని రెండేండ్ల  క్రితమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకయ్యే పూర్తి ఖర్చు భరించేందుకు ముందుకొచ్చింది. ల్యాబ్ ఏర్పాటుకు సరిపడా రెండెకరాల స్థలం చూపాలని కోరింది. ఈ మేరకు ఏడాదిన్నర క్రితమే సెంట్రల్ హెల్త్ టీం వచ్చి వెంగళ్​రావు నగర్‌‌‌‌లో ఆరోగ్యశాఖ పరిధిలో ఉన్న ల్యాండ్‌‌ను పరిశీలించి, ఓకే చేసింది. అయితే, ఈ భూమి ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్‌‌‌‌ ఒప్పుకోలేదు. హైదరాబాద్‌‌లో ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న బిల్డింగ్స్​ను ఆ ప్రభుత్వం బదిలీ చేసిన తర్వాత, కోఠిలోని ఓ బిల్డింగ్‌‌లో ల్యాబ్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. కేంద్ర బృందం వచ్చి పరిశీలించి.. ఆ భవనం పనికిరాదని, హైదరాబాద్ చుట్టు పక్కల ఎక్కడైనా స్థలం కేటాయించాలని కోరింది. శామీర్‌‌‌‌పేట్‌‌, యాచారంలోని స్థలాలను ఈ బృందానికి స్టేట్ హెల్త్ ఆఫీసర్లు చూపించారు. రెండింట్లో ఎక్కడ ఇచ్చినా సరేనని సెంట్రల్‌‌ టీం తెలిపింది. అదీ ముందుకు సాగలేదు. ఈసారి కూడా స్థల కేటాయింపుపై రాష్ట్ర సర్కార్​ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. తాత్కాలికంగా ల్యాబ్ ఏర్పాటు చేయాలని  ప్రపోజల్ పెట్టింది. దీన్ని కేంద్రం తిరస్కరించినట్లు తెలుస్తోంది. జీహెచ్‌‌ఎంసీ పరిధిలో రెండెకరాలు కేటాయించాలని మళ్లీ సూచించింది.


వైరాలజీ ల్యాబ్ తో ఇదీ లాభం


వైరాలజీ ల్యాబ్ ఏర్పాటైతే జికా, ఎబోలా వంటి వైరస్‌‌ల నిర్ధారణ హైదరాబాద్‌‌లో నే అందుబాటులో కి వస్తుం ది. ప్రస్తుతం జికా, ఎబోలా తదితర సస్పెక్టె డ్ కేసుల శాంపిళ్లను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌‌కు పంపించి టెస్టులు చేయిస్తున్నారు. కేవలం డయాగ్నసి స్ సేవలే కాకుం డా, అంటువ్యా ధులపై పరిశోధనలు చేసి, వైరస్‌‌ ఉనికిని కనుగొంటారు. ల్యాబ్‌‌తో అనేక ఉపయోగాలున్న నేపథ్యంలో , ల్యాండ్ కేటాయించకుం డా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును స్టేట్ హెల్త్ ఆఫీసర్లు కూడా తప్పుబడుతున్నారు.